Mangalam Jaya Mangalam – మంగళం జయ మంగళం
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ||
శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం
శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ||
వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||
బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం ||
గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.