Muthyala Harathi Pagadala Harathi – ముత్యాల హారతీ పగడాల హారతీ
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
ముత్యాల హారతీ పగడాల హారతీ
వాసవాంబ నీకిదే వైఢూర్య హారతీ ||
అష్టభుజముల పుష్కరిణియందున
అష్టలక్ష్మీ నీకిదే పచ్చల హారతీ || ముత్యాల ||
వాణి గాయత్రీ సావిత్రి వాసవీ
వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతీ || ముత్యాల ||
కుసుమ కోమలీ అభయముద్రధారిణీ
కోమలాంగి నీకిదే కెంపుల హారతీ || ముత్యాల ||
పద్మభూషణీ సత్ప్రభావతీ
చెలువంత దేవికి పగడాల హారతీ || ముత్యాల ||
మోక్షకారిణీ ఆనందరూపిణీ
మణిద్వీపవాసినికి కర్పూర హారతీ || ముత్యాల ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.