Okapari kokapari – ఒకపరి కొకపరి
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
ఒకపరి కొకపరి కొయ్యారమై |
మొకమున కళలెల్ల మొలసినట్లుండె ||
జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి |
జిగిగొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన |
పొగరు వెన్నెల దిగబోసినట్లుండె ||
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు |
కరిగి యిరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహ మదము |
తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె ||
నెరయు శ్రీ వేంకటేశు మేన సింగారముగాను |
తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగు బోడీ అలమేలు మంగయు తాను |
మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.