Ramachandraya – రామచంద్రాయ
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం || ౧ ||
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం || ౨ ||
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళం || ౩ ||
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం || ౪ ||
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళం || ౫ ||
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం || ౬ ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ౭ ||
Comments
Note: This stotra is available on "Stotra Nidhi" telugu mobile app. Download from Apple App Store and Google Play Store.